ఐపీఎల్ కు ఆలస్యంగా రానున్న డు ప్లెసిస్‌... ఎందుకంటే..?

ఐపీఎల్ కు ఆలస్యంగా రానున్న డు ప్లెసిస్‌... ఎందుకంటే..?

యూఏఈ వేదికగా వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ 2020 కి దక్షిణాఫ్రికా ఆటగాడు ఫఫ్ డు ప్లెసిస్ ఆలస్యంగా రానున్నాడు. 2011 లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన డు ప్లెసిస్ అప్పటినుండి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ తరపునే ఆడుతున్నాడు. అయితే సెప్టెంబర్ 19 న ప్రారంభం కానున్న ఐపీఎల్ కు ఈ ఆటగాడు ఆలస్యంగా రానున్నాడు. ఎందుకంటే... ప్రస్తుతం ఫఫ్ డు ప్లెసిస్ భార్య ప్రగ్నెట్... అయితే ఆమెకు ఈ నెలలో డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పడంతో తన భార్య తో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే వచ్చే నెలలో యూఏఈ కి వెళ్లి అక్కడ తన జట్టుతో కలుస్తాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అతను 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలి. ఆ తర్వాత నిర్వహించిన కరోనా పరీక్షలో అతనికి నెగెటివ్ వస్తే ఐపీఎల్ లో ఆడుతాడు. ఇక తాజాగా సిఎస్కే యాజమాన్యం తమ ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అలాగే జట్టు సహాయక సిబ్బందిని యూఏఈ కి తీసుకెళ్లడం లేదని తెలిపింది.