ఎన్టీవీ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం..వ్యక్తి అరెస్ట్ 

ఎన్టీవీ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం..వ్యక్తి అరెస్ట్ 

NTV పేరుతో ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా  దాలెం రాజు వలస గ్రామానికి చెందిన రౌత్‌ హర్షవర్ధన్...ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. జి.సిగాడం మండలం సర్వేసుపురం గ్రామంలో 58 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా Ntv  లో వార్త వచ్చిందని  రౌతు హర్షవర్ధన్ watsapp గ్రూపుల లో సెండ్ చేస్తున్నాడు. ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హర్ష వర్ధన్ సోషల్ మీడియాలో తన పేరు పాపులర్ కావాలనే ఉద్దేశ్యంతో  ఈ న్యూస్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయంటున్నారు పోలీసులు. ఏది ఫేక్‌ న్యూస్, ఏది నిజమైన వార్తో ప్రజలు గ్రహించి వాటినే నమ్మాలని NTV వీక్షకులకు విజ్ఞప్తి చేస్తోంది.