నటుడు సునీల్ చనిపోయాడంటూ వార్తలు !

నటుడు సునీల్ చనిపోయాడంటూ వార్తలు !

ఇన్నాళ్లు వయసు మీదపడి, సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న నటీ నటులు చనిపోయారంటూ వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే.  ఈ తప్పుడు వార్తల వలన ఆయా నటీ నటులు బయటికొచ్చి మేము బాగానే ఉన్నామని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.  ఇలాంటి వార్తలపై పలువురు పోలీసులకు పిర్యాదులు కూడా చేశారు.  అయినా అవి ఆగడంలేదు.  

తాజాగా ప్రముఖ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు.  ఈ విషయం తెలుసుకున్న సునీల్ తనకేమీ కాలేదని, బాగానే ఉన్నానని, ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ప్రేక్షకులకు, అభిమానులకు తెలిపారు.  సైబర్ పోలీసులు ఇలాంటి తప్పుడు వార్తల్ని పుట్టించే వారిపై ఇంకొంచెం నిఘా పెంచడం మంచిది.