రవి ప్రకాష్‌పై తప్పుడు ప్రచారం.. నలుగురి అరెస్ట్..!

రవి ప్రకాష్‌పై తప్పుడు ప్రచారం.. నలుగురి అరెస్ట్..!

ఫోర్జరీ కేసు వివాదంలో చిక్కుకున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు సైబర్ క్రైం పోలీసులు... రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు వివాదంలో తప్పుడు ప్రచారం చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న నలుగురు వ్యక్తులను గుర్తించిన పోలీసులు.. యూట్యూబ్, వెబ్ సైట్లలో తప్పుడు సమాచారాన్ని సర్క్యూలేట్ చేస్తున్న ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న నలుగురు వ్యక్తులను విచారిస్తున్న సైబర్ క్రైం పోలీసులు... వారి అసలు ఉద్దేశం ఏంటనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు.