ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ ఈ రెండే... 

ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ ఈ రెండే... 

2020 అందరికి గుర్తుండిపోయేలా చేసింది కరోనా మహమ్మారి.  2020లో గొప్ప గొప్ప విషయాలు జరుగుతాయని ప్రపంచంలోని అందరూ ఆలోచించారు.  కానీ, కరోనా వచ్చి అందరి ఆశలపై నీళ్లు చల్లింది.  కొందరికి మాత్రమే లాభం చేకూర్చి కోట్లాది మందికి చేదు అనుభవాలు మిగిల్చింది కరోనా.  2020 లో టాప్ ట్రెండింగ్ లో కరోనా నిలవడం విశేషం.  కరోనా వైరస్ గురించి ఎలాంటి కొత్త వార్త వచ్చినా అది ట్రెండ్ అవుతున్నది.  చైనాలోని వుహాన్ నగరంలో ఈ వైరస్ ప్రారంభం అయ్యింది.  అయితే, ఈ మహమ్మారికి కారణం గబ్బిలం అని, గబ్బిలం సూప్ తాగడం వలన వైరస్ వ్యాపించిందని వార్తలు రావడంతో కరోనా గబ్బిలం సూప్  ట్రెండ్ అయ్యింది 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి టాపిక్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది.  ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ అనారోగ్యంతో మరణించాడనే వార్త కొన్ని రోజులపాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.  ఏప్రిల్ నెలలో అయన 10 రోజులపాటు ఎవరికి కనిపించలేదు.  ఏమయ్యాడో తెలియలేదు.  పాలనా అధికారం కిమ్ సోదరి చూసుకోవడంతో ఆ వార్తా సంచలనంగా మారింది.  ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో టాప్ గా నిలిచాయి.