రైల్వేలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం

రైల్వేలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం

సికింద్రాబాద్ రైల్వే విభాగంలో నకిలీ ఫార్మ బిల్లుల కుంభకోణం వెలుగు చూసింది. నకిలీ బిల్లులు సృష్టించి ఏకంగా రూ.2.20 కోట్లు స్వాహా చేసినట్లు తేలింది. రైల్వేశాఖలో గత ఏడాది అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య 31 నకిలీ ఫార్మా బిల్లులు సమర్పించారు. నకిలీ ఫార్మా బిల్లులు సమర్పించిన కుంభకోణంలో పలువురిపై కేసు నమోదైంది. రైల్వే అకౌంట్స్ అసిస్టెంట్ గణేశ్‌కుమార్, సాయిబాలాజీ ఫార్మా, వినాయక ఏజెన్సీ, తిరుమల ఏజెన్సీల పై కేసులు నమోదయ్యాయి. రైల్వే విజిలెన్స్ విభాగం ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది.