రోడ్డుపై కూలిపోయిన వృక్షాలు.. స్తంభించిన ట్రాఫిక్..

రోడ్డుపై కూలిపోయిన వృక్షాలు.. స్తంభించిన ట్రాఫిక్..

అకాల వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ గాలులు పంజా విసరడంతో ఓవైపు రైతులను భారీ నష్టం.. మరోవైపు రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఖమ్మం జిల్లా లింగాల ప్రధాన రహదారి మర్రిగూడెం సమీపంలో గాలి దుమారంతో  వర్షం కురవడంతో భారీ వృక్షాలు రోడ్డుపై అడ్డంగా కూలిపోయాయి. లింగా రోడ్డుపై భారీ వృక్షం నేమట్టమై కార్లపై పడింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, రోడ్డుపై చెట్లు కూలిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘటన జరిగి రెండు, మూడు గంటలు గడిచినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.