అమెరికాలో మళ్ళీ కాల్పులు.. భయంలో ప్రజలు

అమెరికాలో మళ్ళీ కాల్పులు.. భయంలో ప్రజలు

అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయింది.  గత కొంతకాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.  దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  తాజాగా చికాగో రాష్ట్రంలోని మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న సోల్టన్ హైస్కూల్ సమీపంలో  ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.  ఈ కాల్పుల్లో 8 సంవత్సరాల బాలిక మరణించగా, మరో ముగ్గురు వాయపడ్డాడు.  

బాధిత బాలిక తన కుటుంబంతో కలిసి ఫుట్ బాల్ మ్యాచ్ ను చూసేందుకు వచ్చింది.  ఆ సమయంలో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఆ బాలిక మరణించింది.. ప్రస్తుతం పోలీసులు కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.  గత ఏప్రిల్ నుంచి ఈ సెయింట్ లూయిస్ నగరంలో వరసగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  ఇప్పటి వరకు జరిగిన ఇలాంటి ఘటనల్లో దాదాపు 12 మంది బలయ్యారు.