కోర్టులో కేసు వేసినందుకు సాంఘిక బహిష్కరణ!

కోర్టులో కేసు వేసినందుకు సాంఘిక బహిష్కరణ!

తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలో ఓ కుటుంబాన్ని గ్రామ పెద్దలు సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  

పెదపూడి మండలంలోని పైన గ్రామంలో ఓ స్థలం విషయంలో పంచాయతీ పెద్దలతో సుబ్బారావు అనే వ్యక్తికి వివాదం మొదలైంది. సుబ్బారావు కోర్టును ఆశ్రయించగా ఆయనకు అనుగుణంగా జిల్లా కోర్టు స్టే ఇచ్చింది. తమను కాదని కోర్టుకెళ్లారంటూ సుబ్బారావుపై ఆ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు.

సుబ్బారావు కుటుంబంతో మాట్లాడినా, నిత్యావసర వస్తువుల విక్రయించినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు స్పందించలేదని సుబ్బారావు చెప్పారు.