నటి శ్రావణి ఆత్మహత్యకు కారణం అతనే... కుటుంబ సభ్యుల ఆరోపణ 

నటి శ్రావణి ఆత్మహత్యకు కారణం అతనే... కుటుంబ సభ్యుల ఆరోపణ 

తెలుగు బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మనసు మమత,మౌనరాగం సీరియళ్లలో ఆమె నటించింది. ఆమె ఆత్మహత్యకు ప్రధాన కారణం టిక్ టాక్ లో పరిచయమైన దేవరాజురెడ్డి అని శ్రావణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దేవరాజురెడ్డిది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలు. ఆయన టిక్ టాక్ లో శ్రావణికి పరిచయమయ్యాడు. శ్రావణితో పరిచయం ఉన్న దేవరాజ్ ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెతో చనువుగా ఉన్న ఫోటోలను తీసుకున్నాడు. తనకు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫోటోలు బయటపెడుతానని బెదిరించాడు. అడిగినప్పుడల్లా నగదు ఇచ్చినా ఆమె పై వేధింపులకు గురి చేశాడు. దీంతో శ్రావణి దేవరాజు పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతనిలో మార్పు లేకపోవడంతో వేధింపులు తాళలేక శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.