జ్యోతి సమాధి వద్ద కుటుంబ సభ్యుల ధర్నా

జ్యోతి సమాధి వద్ద కుటుంబ సభ్యుల ధర్నా

ఏపీ రాజధాని అమరావతిలో దారుణ హత్యకు గురైన జ్యోతి సమాధి వద్ద కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు. పోలీసుల విచారణపై జ్యోతి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. జ్యోతి సోదరుడు ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... పోలీసులు కేసుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు జ్యోతి మృతదేహానికి పోస్ట్ మార్టం జరగలేదు. పోస్ట్ మార్టం జరిగితే ఒంటిమీద దుస్తులు కూడా తొలగించరా?. దుస్తులతోనే మృతదేహాన్ని మాకు అప్పగించారని అన్నారు.

ఈ రోజు ఉదయం పొలీసులు వచ్చి మమ్మల్ని బెదిరించి మృతదేహాన్ని బయటకు తీయించారు. ఒంటిపై ఉన్న దుస్తులు ఇన్వెస్టిగేషన్ పేరుతో వచ్చి తీసుకెళ్లారు. నిందితుడిని కాపాడేందుకే పోలీసులు ప్రయతినిస్తున్నారని ఆరోపించారు. శ్రీనివాస్ మా చెల్లిని అక్కడికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఆమె లొంగకపోవడంతోనే హత్య చేశాడన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తన తలపై దెబ్బ కొట్టించుకున్నాడు. సిట్టింగ్ జడ్జ్ తో కేసు విచారణ జరిపించాలని ప్రభాకర్ డిమాండ్ చేశాడు.