ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య..

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య..

ఖమ్మంలో దారుణం జరిగింది.. ముస్తఫా నగర్‌లో ఇద్దరు పిల్లలు సమా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకుకోవడం నగరంలో విషాదాన్ని నింపింది. ముస్తఫా నగర్‌లోని మధురానగర్‌లో ఉంటున్న వెంకటప్రసాద్ కుటుంబసభ్యులు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు వెంకట ప్రసాద్ (40), సుమిత (35), రిశీత (13), జాహ్నవి (10)గా గుర్తించారు పోలీసులు.