దంగల్ స్పూర్తితో టాలీవుడ్ లో మరోసినిమా..!!!

దంగల్ స్పూర్తితో  టాలీవుడ్ లో మరోసినిమా..!!!

 

దంగల్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది.  ఇండియన్ టాప్ సినిమాల్లో ఇదికూడా ఒకటి.  ఈ సినిమా స్పూర్తితో ఇండియాలో చాలా సినిమాలు వచ్చాయి.  దంగల్ స్పూర్తితో తెలుగులో కూడా సినిమాలు తెరకెక్కాయి.  ఇప్పుడు మరో సినిమా తెరకెక్కబోతున్నది.  కోలీవుడ్ టాప్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్ రోల్ చేస్తూ సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాత నిర్మల్ కుమార్ సిద్ధం అవుతున్నాడు.  

ఆటగదరా శివ సినిమా హీరో ఉదయ్ శంకర్ హీరోగా చేస్తున్నాడు.  ఫేమస్ విలన్ ప్రదీప్ రావత్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నాడట.  ఐశ్వర్య రాజేష్ ఇందులో రెజ్లర్ గా కనిపించబోతున్నది.  త్వరలోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.