హైదరాబాద్లో మొదలుకానున్న ఫేమస్ హోటల్ !

హైదరాబాద్లో మొదలుకానున్న ఫేమస్ హోటల్ !

మన తెలుగు రాష్ట్రాల ప్రజలు భోజనానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో తెలిసిన సంగతే.  మంచి, రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుంతుందన్నా వెళ్లి ఎంతైనా ఖర్చు చేస్తారు మనవాళ్ళు.  మన తెలుగు ప్రజలు మెచ్చే హోటళ్ల జాబితాలో కాకినాడ సుబ్బయ్య హోటల్ కూడ ఒకటి. 

పది రకాల కూరలతో, నేతిని దట్టించిన వేడి వేడి అన్నం ఈ సుబ్బయ్య హోటల్ ప్రత్యేకత.  చాలా మంది ఏ పనిమీదైనా కాకినాడ వెళితే పనిగట్టుకుని మరీ సుబ్బయ్య హోటల్ కు వెళ్లి కడుపు నిండా లాంచేసి వస్తుంటారు.  అలాంటి ఈ హోటల్ త్వరలో హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ప్రాంతంలో మొదలుకానుంది.  మరి శాఖాహార భోజన ప్రియులు రెడీగా ఉండండి.