రైనా రాకను కోరుకుంటున్న అభిమానులు...

రైనా రాకను కోరుకుంటున్న అభిమానులు...

ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020 లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడగా అందులో కేవలం ముంబై ఇండియన్స్ పై ఆడిన మొదటి మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత రాజస్థాన్ పై ఆడిన రెండో మ్యాచ్ 16 పరుగుల తేడాతో ఓడిపోగా ఇక నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ పై 44 పరుగుల తేడాతో పరాజయం పొందింది. అయితే చెన్నై ఇలా వరుస పేలవ ప్రదర్శనలు చేయడంతో ఆ జట్టు అభిమానులు అందరూ ఈ ఏడాది ఐపీఎల్ నుండి వెళ్లిపోయిన సురేష్ రైనా మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ అయిన సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే రైనా వెళ్లిపోవడం అనేక చర్చలకు దారితీసింది. హోటల్ గది విషయంలో సిఎస్కే జట్టు యాజమాన్యంతో తనకు గొడవ జరిగిందని అందుకే అతను తిరిగి వచ్చేసాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ రైనా మాత్రం తన మామ హత్య కారణంగా నేను భారత్ కు వచ్చాను అని చెప్పాడు. ఐపీఎల్ ను వీడిన ప్రాక్టీస్ చేస్తున్నానని, మళ్ళీ తనను దుబాయ్ లో చూసే అవకాశం కూడా ఉందన్నాడు. కానీ అతను మళ్ళీ జట్టులోకి రాలేదు. కానీ ఇప్పుడు చెన్నై జట్టు చేస్తున్న ప్రదర్శన కారణంగా రైనా మళ్ళీ జట్టులోకి రావాలని అభిమానులు సోషల్ మీడియా వేదిక తెలుపుతున్నారు.