ఐపీఎల్ ఫైనల్‌: టికెట్ల కోసం అష్టకష్టాలు

ఐపీఎల్ ఫైనల్‌: టికెట్ల కోసం అష్టకష్టాలు

ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్ధమవుతోంది... ఐపీఎల్ 2019 సీజన్‌ ఫైనల్‌కి చేరిన చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఫైనల్‌ మ్యాచ్‌లో తపలడనున్నాయి. ఐపీఎల్‌లో చిరకాల ప్రత్యర్థులుగా పేరొందిన ముంబై, చెన్నై జట్లు మరోసారి టైటిల్ కోసం ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు రాత్రి 7.30 గంటలకి ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఎలాగైనా ఫైనల్ మ్యాచ్‌ చూడాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. దీని కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోగా... వారంతా మళ్లీ జింఖాన గ్రౌండ్స్‌ దగ్గర టికెట్ పొందాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. ఓవైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు క్రికెట్ ఫ్యాన్స్ మండుటెండల్లో అల్లాడుతూనే జింఖానా గ్రౌండ్స్‌లో టికెట్ కోసం పడిగాపులు పడుతున్నారు. ఇక్క కేవలం రెండు కౌంటర్లే ఏర్పాటు చేయడంతో.. టికెట్ పొందాలంటే కనీసం ఐదు గంటలు క్యూలైన్‌లో నిల్చావాల్సిన పరిస్థితిపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కనీసం తాగునీటి సదుపాయం కూడా లేక... ఎండలోనే గంటలపాటు ఎదురుచూస్తున్నారు అభిమానులు.