అందరిలోనూ అదే ఉత్కంఠ...ఎప్పుడు వస్తుంది... ఎలా ఉండబోతుంది...!!

అందరిలోనూ అదే ఉత్కంఠ...ఎప్పుడు వస్తుంది... ఎలా ఉండబోతుంది...!!

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రావడం మొదలుపెట్టాయి.  చాలా కాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటకు రావడం లేదు.  మొదట రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు.  కానీ, రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను క్యాన్సిల్ చేసుకోవడం, దేశంలో కరోనా ప్రభావం వలన ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అవుతుందా కాదా అనుకున్నారు.  

కానీ, ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు.  అయితే, ఈ మోషన్ పోస్టర్ ఎలా ఉండబోతుంది.  ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అన్నది తెలియడం లేదు. ఇప్పుడు అందరిలోనూ ఇదే ఉత్కంఠత నెలకొన్నది. మోషన్ పోస్టర్ అభిమానులను తప్పనిసరిగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు అభిమానులు. రాజమౌళి సినిమా కాబట్టి సమ్ థింగ్ కొత్తగా ఉంటుందని అంటున్నారు.