అభిమానులు ఈ నియమాలను పాటించాల్సిందే...

అభిమానులు ఈ నియమాలను పాటించాల్సిందే...

కరోనా అనంతరం ఇండియాలో మొదటి అంతర్జాతీయ సిరీస్ ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతుంది. అయితే ఈ 4 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లో చెన్నై లో జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన మొదటి టెస్ట్ కు మ్యాచ్ కు అభిమానులను అనుమతించలేదు... కానీ ఈ శనివారం నుండి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కు అభిమానులను స్టేడియంలోకి అనుమతించారు. అయితే  రెండో టెస్టుకు హాజరయ్యే అభిమానులకు... నిర్వాహకులు కీలక సూచనలు చేశారు. స్టేడియంలోకి బైనాక్యులర్లు, స్పీకర్లు, సంగీత పరికరాలు వంటివి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. సంచులు, బ్రీఫ్‌కేసులు, రేడియోలు, లేజర్‌ పాయింటర్లు, డిజిటల్‌ డైరీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టేప్‌ రికార్డర్లు, రికార్డింగ్‌ పరికరాలపై నిషేధం ఉన్నట్లు తెలిపారు. 2012 నుంచి మూసేసిన ఐ, జే, కే స్టాండ్లను తెరుస్తున్నామని వెల్లడించారు.