మహేష్ చేసిన పనికి అభిమానుల్లో టెంక్షన్ !
మహేష్ బాబు యొక్క 26వ చిత్రం ఈ నెల 31న లాంచ్ కానుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాకు సంగీత దర్శకుడు ఎవరనే చర్చ మొదలైంది. ముందుగా దేవి శ్రీ ప్రసాద్ పేరు వినిపించగా తర్వాత తమన్, అమిత్ త్రివేదిలు పేర్లు కూడా జాబితాలో చేరాయి.
కానీ మహేష్ మాత్రం దేవి శ్రీ మీదే ఆసక్తిగా ఉన్నారట. ఒకవేళ దేవి శ్రీ కన్ఫర్మ్ అయితే వారి కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ చిత్రమవుతుంది. గతంలో దేవి మహేష్ చేసిన వరుస సినిమాలు 'భరత్ అనే నేను, మహర్షి'కి మ్యూజిక్ అందించారు. ఇకపోతే దేవి శ్రీ ఫైనల్ అనే వార్త బయటికి రాగానే అభిమానుల్లో కొంత టెంక్షన్ మొదలైంది. ఎందుకంటే 'మహర్షి'కి దేవి గుర్తుండిపోయే స్థాయిలో సంగీతం ఇవ్వలేదు. అయినా మహేష్ అతనే కావాలంటున్నాడు. కాబట్టి ఈసారైనా దేవి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇస్తే బాగుండని అనుకుంటున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)