తహశీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ దాడి కలకలం

తహశీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ దాడి కలకలం

తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం మర్చిపోకముందే మరో పెట్రోల్ దాడి కలకలం సృష్టిస్తోంది.  కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి కంప్యూటర్లపై పెట్రోల్ చల్లాడు. లంబడిపల్లికి చెందిన కనకయ్య అనే వ్యక్తి తన భూ సమస్య పరిష్కారం కావడం లేదన్న ఆవేదనతో పెట్రోల్ తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. బాటిల్ తెరిచి కంప్యూటర్లపై పెట్రోల్ చల్లాడు. ఆ క్రమంలో అధికారులపైనా పెట్రోల్ పడింది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. కొడుకు పేర మీద రాసిన తన భూమిని తిరిగి తన పేరుపై మార్పించాలని చానాళ్లుగా  కనకయ్య రెవెన్యూ అధికారులను కోరుతున్నాడు. ఎంతకీ భూమి బదలాయింపు జరగలేదన్న ఆవేదనతో పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు.