రైతులు సోలార్ విద్యుత్ వాడాలి: గవర్నర్

రైతులు సోలార్ విద్యుత్ వాడాలి: గవర్నర్

వ్యవసాయ రంగంలో రైతులు సోలార్ విద్యుత్ వాడకంను మొదలెట్టాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో సోలార్ ఎనర్జీ ఉపయోగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.. సోలార్ ప్యానెల్ లేకపోతే జిహెచ్ఎంసి అనుమతి ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. మెట్రో పాలిటన్ సిటీలో ప్రజలు సోలార్ ఎనర్జీ ఉపయోగించేలా, వ్యవసాయ రంగంలో రైతులు సోలార్ విద్యుత్ వాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ లేక చీకట్లు అలుముకుంటాయని బయపెట్టారు. అలాంటి పరిస్థితులు రానందుకు సంతోషంగా ఉందని గవర్నర్ తెలిపారు.

విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తుంది. సోలార్ విద్యుత్ తయారీ ద్వారా ఆ డబ్బును ఇతర కార్యక్రమంలకు మళ్లించాలని గవర్నర్ కోరారు. రినబుల్ ఎనర్జీ వైపు ప్రజలను ప్రోత్సహించాలి, ఆ ఫలాలు అందినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యంను తగించవచ్చు. తద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడిన వారవుతారన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాకు కృషి చేసిన సీఎండీ ప్రభాకర్ రావును అభినందనీయులు. వచ్చే ఏడాది బహుమతుల ప్రదానం నాటికి ఇంజినీర్స్ భవనం కూడా సోలార్ ఎనర్జీ పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ గా, వ్యక్తిగతంగా కోరుతున్నానన్నారు.