కొనసాగుతోన్న రైతుల ఆందోళన.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు

కొనసాగుతోన్న రైతుల ఆందోళన.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు

కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి... ఈ నెల 1వ తేదీన జరిపిన చర్చలు విఫలం కావడంతో.. ఇవాళ సుదీర్ఘంగా సమావేశం జరిగింది... ఇక, లంచ్ సమయంలో.. రైతు ప్రతినిధుల కోసం ప్రభుత్వం భోజనం ఏర్పాట్లు చేయగా... అక్కడ భోజనం చేసేందుకు నిరాకరించిన రైతు సంఘాల నేతలు... బయట నుంచి భోజనాలు తెప్పించుకుని చేశారు.. ఇక, లంచ్ తర్వాత మళ్లీ సమావేశం కొనసాగినా.. చర్చలు మాత్రం అసంపూర్తిగానే ముగిశాయి.. ఇవాళ మొత్తంగా దాదాపు 7 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది... లంచ్ బ్రేక్ వరకు సమావేశంలో అభ్యంతరాలు, అనుమానాలు, భయాలను వ్యక్తం చేస్తూ మాట్లాడారు రైతు సంఘాల నేతలు... ఇక, లంచ్ బ్రేకు తర్వాత ప్రభుత్వ వాదనలను వినిపించారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్... చట్టాలను ఉపసంహరించుకొనే విషయంలో ప్రభుత్వానికి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని.. లోపాలుంటే, అభ్యంతరాలుంటే పరిష్కారాలపై చర్చించేందుకు సిద్దమే.. కానీ, ఉపసంహరణకు మాత్రం ససేమిరా అని సర్కార్ స్పష్టం చేసింది.. ఇలా జరిగితే, అది ఒక ఆనవాయుతీ గా మారే అవకాశం ఉంది.. భవిష్యత్తులో ఇలానే చట్టాలు ఉపసంహరించుకోవాలంటూ వేల మందితో  ఢిల్లీ కి వచ్చే ప్రమాదం ఉందన్నది వారి వాదనగా ఉంది.. రైతు సంఘాల నేతలు, ప్రభుత్వం మధ్య చర్చలు ఎటూ తేలకపోవడంతో.. సమావేశం అసంపూర్తిగా ముగిసింది... ఎల్లుండి మరోసారి సమావేశం జరగనుంది. కాగా, ఢిల్లీలో రైతుల ఆందోళన వారం రోజులకు చేరుకున్న సంగతి తెలిసిందే..