డిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత...భారీగా ట్రాఫిక్ జామ్ 

డిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత...భారీగా ట్రాఫిక్ జామ్ 

ఢిల్లీ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన అంబాలాకు పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు.  రైతులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. కేంద్రం తీసుకొచ్చిన రైతుల బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఆందోళన చేస్తున్నారు.  కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు బిల్లుల వలన నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, అంబాలకు సమీపంలో శంభూ బోర్డర్ వద్ద పెద్ద సంఖ్యలో బారీకేడ్లు, వాటర్ క్యాన్లను పోలీసులు మోహరించారు.  రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావణం నెలకొనడంతో పోలీసులు జలఫిరంగులతో వాటర్ ను ప్రయోగించారు.  సోనీపట్ వైపు నుంచి ఢిల్లీలో ప్రవేశించే సింగు సరిహద్దు వద్దకు దాదాపుగా మూడు వందల మంది రైతులను మోహరించారు.  సింగ్ సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున రైతులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.  దీంతో ఢీల్లీలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరిగింది.