రైతు భరోసా ప్రారంభానికి ముందు మరో కీలక నిర్ణయం..

రైతు భరోసా ప్రారంభానికి ముందు మరో కీలక నిర్ణయం..

వైఎస్సార్ రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నెల్లూరు జిల్లాలో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక, సోమవారం కీలక సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.12,500 నుంచి రూ13,500 పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక సోమవారం రాత్రి సమయానికి రైతులకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇస్తున్న పరిహారం విషయంలో కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆత్మహత్య పరిహారాన్ని రూ. 7 లక్షలకు పెంచుతూ జీవో విడుదల చేశారు. మొదట రైతు ఆత్మహత్య చేసుకుంటే చెల్లించే పరిహారం రూ.5 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.2 లక్షలు పెంచి.. రూ.7 లక్షలు చేశారు సీఎం వైఎస్ జగన్.