త్వరగా పెళ్లి చేయమనందుకు కొడుకు పై గోడలితో తండ్రి...

త్వరగా పెళ్లి చేయమనందుకు కొడుకు పై గోడలితో తండ్రి...

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.  షాద్‌నగర్ కొత్తూరు మండలం చేగూర్ గ్రామంలో తండ్రి కొడుకుల మద్య ఘర్షణ జరిగింది. వివాహం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది..  తనకు తొందరగా వివాహం చేయాలని తండ్రి పై ఒత్తిడి తెచ్చాడు కొడుకు. దాంతో మద్యం మత్తులో కొడుకు పై గొడ్డలి తో దాడి చేసాడుతండ్రి ఎల్లయ్య. ఏ ఘటనలో కొడుకు నరేష్ కు తీవ్రగాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరేష్ మృతి చెందాడు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న నందిగామ పోలీసులు... తండ్రి ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.