కొడుకునే కడతేర్చారు...

కొడుకునే కడతేర్చారు...

తల్లిదండ్రులకు ఆసరగా ఉండాల్సిన కుమారుడు మద్యానికి బానిసయ్యాడు... మద్యం కోసం నిత్యం కన్నవారిని వేధించసాగాడు... మద్యానికి బానిసైన కొడుకు డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు... ఎలాగైనా కుమారుడిని మట్టుబెట్టాలనుకున్నారు. కొడుకు రవి అగడలను భరించలేక... నిద్రిస్తున్న సమయంలో కొడుకును గొడ్డలితో నరికి చంపాడు తండ్రి రాజాం... రక్తపు మడుగులో విలవిలలాడుతూ రవి మృతిచెందాడు. జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.