కొడుకు పరీక్ష కోసం 85 కిమీ సైకిల్ తొక్కిన తండ్రి...
పిల్లలు పరీక్షలు రాస్తుంటే, వారికంటే తల్లిదండ్రులే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. బాగా రాయాలని దేవుళ్ళకు మొక్కుకుంటారు. ఇక పిల్లల్ని పరీక్షలకు తీసుకెళ్లే సమయంలో తల్లి దండ్రులు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. అసలే కరోనా సమయం, రవాణా సౌకర్యాలు సరిగా లేవు. ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే, విద్యార్థులు హాజరు కావడానికి ఎన్ని కష్టాలు పడాలో చెప్పక్కర్లేదు. ఇలానే మధ్యప్రదేశ్ లోని దార్ జిల్లా మనావర్ ప్రాంతానికి చెందిన 10 తరగతి విద్యార్థి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉన్నది. పరీక్షా కేంద్రం 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రవాణా సౌకర్యాలు లేవు. దీంతో ఆ విద్యార్థి తండ్రి సైకిల్ మీద ఆ విద్యార్థిని తీసుకెళ్లి పరీక్ష రాయించాడు. ఈనెల 18 వ తేదీన పరీక్ష ఉండగా, 17 వ తేదీన సైకిల్ మీద బయలుదేరి 85 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)