ఏపీలో దారుణం.. త‌ల్లి చ‌నిపోయింద‌ని పిలిచి.. క‌న్న‌కూతురిపై అత్యాచారం..!

ఏపీలో దారుణం.. త‌ల్లి చ‌నిపోయింద‌ని పిలిచి.. క‌న్న‌కూతురిపై అత్యాచారం..!

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రే కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విజ‌య‌న‌గ‌రం జిల్లా సీతానగరం మండలం నిడగల్లులో.. కూతురు.. త‌ల్లిదండ్రుల‌కు ఇష్టంలేని పెళ్లి చేసుకుంది.. తాను ప్రేమించినవాడితో పెళ్లికోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. ప్రేమ వివాహం చేసుకుందని కూతురుపై తండ్రి పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఇంటికి ర‌ప్పించాల‌ని ప్లాన్ చేశాడు.. తల్లి మరణించిందని చెప్పి కూతురిని ఇంటికి రప్పించాడు. కూతురుపై కోపంతో ర‌గిలిపోతున్న తండ్రి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి వికృత చేష్టలను ప్రతిఘటించిన కూతురు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. క‌న్న కూతురును కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన తండ్రి... త‌మ‌కు ఇష్టం లేకుండా.. ప్రేమించి పెళ్లిచేసుకుంద‌ని క‌క్ష పెంచుకుని దారుణానికి ఒడిగ‌ట్టాడు.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు.