భూవివాదం.. తండ్రీకొడుకుల హత్య

భూవివాదం.. తండ్రీకొడుకుల హత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో దారుణ సంఘటన జరిగింది. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని కృష్ణరావు పల్లెలో తండ్రీకొడుకులను అదే గ్రామానికి చెందిన ప్రత్యర్ధులు గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. వ్యవసాయ భూమిలో తండ్రీకొడుకులు ట్రాక్టర్ తో భూమిని దున్నుతున్న సమయంలో ఈ హత్య జరిగింది. స్థానికుల సమచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకు భూవివాదమే కారణమని పోలీసులు తెలిపారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.