కొడుకుని నరికి చంపిన తండ్రి...

కొడుకుని నరికి చంపిన తండ్రి...

కొడుకును కన్నతండ్రే దారుణంగా నరికి చంపిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది... కాకినాడ రూరల్ మండలం పగడాలపేట బుల్లబ్బాయిరెడ్డి నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే... కొడుకు గోవిందును తండ్రి అప్పారావు నరికి చంపాడు... 25 ఏళ్ల గోవింద్ పెళ్లి చేసుకుని కూడా తనపైనే ఆధారపడుతున్నాడంటూ తరుచూ గొడవపడేవారు... ఇద్దరి మధ్య విభేదాల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున కొడుకును నరికి చంపిన తండ్రి... అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.