2019 వరల్డ్‌కప్‌ 'పాక్'దే

2019 వరల్డ్‌కప్‌ 'పాక్'దే

ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న 2019 ప్రపంచకప్‌ను పాకిస్తాన్‌ గెలుస్తుందని పాక్ ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఫకార్‌ జమాన్‌ మీడియాతో మాట్లాడారు. మేము టైటిల్ గెలవడానికే ఇంగ్లాండ్ వెళుతున్నాం. 2019 ప్రపంచ కప్ కోసం మా జట్టుకు ఫేవరేట్ లేబుల్ ఇవ్వడం సరైనదని నేను భావిస్తున్నాను. ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌ను పాకిస్థాన్ గెలుస్తుంది. టోర్నీలో పాక్ జట్టు కచ్చితంగా హాట్ ఫేవరెట్ అని ఫకార్‌ తెలిపారు.

సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఆసియా కప్‌‌లో రాణించడంపైనే దృష్టి పెట్టాను. ఆసియా కప్‌‌లో పాకిస్తాన్ జట్టు టీమిండియాను ఎదుర్కొనే అవకాశముంది.. ఆ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా. ప్రపంచకప్‌కు చాలా సమయం ఉంది కనుక ప్రస్తుతం ఉ‍న్న సిరీస్‌లపై దృష్టిసారిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ప్రపంచకప్‌పై దృష్టి పెడతా అని ఫకార్ జమాన్ పేర్కొన్నారు. వాస్తవానికి టెస్ట్‌ క్రికెట్‌ ఓ ఆటగాడి నైపుణ్యానికి అంతిమ పరీక్ష పెడుతుంది.. ఈ ఫార్మాట్‌ లో రాణించడమే తన కల అని ఫకార్‌ జమాన్‌ అన్నారు.

ఫకార్ జమాన్ తన చివరి నాలుగు ఇన్నింగ్స్ లలో 85, 210*, 43*, 117  స్కోర్ చేశారు. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 210 పరుగులు చేసి పాక్ తరపున డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఫకార్ జమాన్ రికార్డుల్లోకి ఎక్కాడు.