ఆ భర్తను పట్టిస్తే..రూ.70 లక్షల బహుమానం..!! 

ఆ భర్తను పట్టిస్తే..రూ.70 లక్షల బహుమానం..!! 

అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య పాలక్ తో కలిసి అమెరికాలోని హనోవర్‌ మేరీల్యాండ్‌లోని డంకిన్‌ డోనట్‌ స్టోర్‌లో పనిచేసేవారు.  2015 వ సంవత్సరం ఏప్రిల్ లో ఓ రోజు రాత్రి భద్రేశ్ కుమార్ తన భార్యతో కలిసి డోనట్ స్టోర్ లో పనిచేస్తున్న సమయంలో భర్త భద్రేశ్ కుమార్ ఆమె భార్యను హతమార్చి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.  

భార్యను హత్యచేసి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తనకు సంబంధించిన వస్తువులు తీసుకొని పరార్ అయ్యాడు.  2015 నుంచి అతని కోసం అమెరికన్ పోలీసులు, ఎఫ్.బి.ఐ గాలిస్తోంది.  అమెరికాలో గాలించిన దొరక్కపోవడంతో అతని కోసం ఇండియాలో గాలించడం మొదలుపెట్టింది ఎఫ్.బి.ఐ.  ఇప్పటి వరకు దొరకలేదు.  దీంతో అతని ఆచూకి చెప్పిన వాళ్లకు లక్ష డాలర్ల బహుమానం ఇస్తామని ఎఫ్.బి.ఐ ప్రకటించింది.  ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.