ఎఫ్.సి.యు.కె. మూవీ పబ్లిక్ రెస్పాన్స్
జగపతిబాబు లీడ్ రోల్లో నటించిన ‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్) మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ లో కె. ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకుడు. కార్తీక్, అమ్ము అభిరామి ఇందులో జంటగా నటించారు. కార్తీక్, ఉమ మధ్య ప్రేమకథలో సడన్‌గా చిట్టి అనే చిన్నపాప ఎంటరైతే వచ్చే అపార్థాలు దేనికి దారి తీస్తాయి? ఆ పాప ఎవరు? ఆ లవ్ స్టోరీని ఆమె ఎలా గట్టెక్కించిందనేది? అనే పాయింట్ ఇంటరెస్టింగ్‌గా, కామిక్ వేలో మలిచాడు దర్శకుడు. పాత్రల మధ్య ఉండే కన్ఫ్యూజన్.. మంచి ఫన్ను అందిస్తుంది. మరి ప్రేక్షకులను ఏమేరకు 'ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్' ఆకట్టుకున్నారో తెలియాలంటే ఈ పబ్లిక్ రెస్పాన్స్ వీడియోలో చూసేయండి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)