జగపతిబాబు చిట్టికి 6న బారసాల!

జగపతిబాబు చిట్టికి 6న బారసాల!

ఈ మధ్య కాలంలో కాస్తంత వినోదంతో పాటు వివాదాన్ని రేపిన టైటిల్ 'ఎఫ్.సి.యు.కె'. ఈ షార్ట్ ఫార్మ్ ను విడదీసి చదువుకోవాలంటే... 'ఫాదర్ - చిట్టి - ఉమా - కార్తీక్'. జగపతిబాబు ఫాదర్ గా నటిస్తున్న ఈ మూవీలో ఆయన కూతురు చిట్టీ, కొడుకు కార్తీక్, అతని ప్రియురాలు ఉమ కీలక పాత్ర ధారులు. ఇందులో బుల్లి పాప చిట్టీ బారసాల కార్యక్రమాన్ని నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ ఈ నెల 6న జరుపబోతున్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదే నెల 12న జనం ముందుకు రాబోతోంది. సో... ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బారసాల అనే పేరు పెట్టారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూస్తే... కథేమిటన్నది కాస్తంత అర్థం అవుతుంది. కొరియోగ్రాఫర్ విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీని కుటుంబ సమేతంగా చూడొచ్చని, తమ బ్యానర్ నుండి వచ్చిన మంచి చిత్రాల సరసన ఇదీ నిలుస్తుందని దామోదర ప్రసాద్ హామీ ఇస్తున్నారు!