ఎఫ్‌సీయూకే టీజర్ రిలీజ్

ఎఫ్‌సీయూకే టీజర్ రిలీజ్

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మళ్లీ లీడ్ రోల్ చేయనున్నారు. ఎఫ్‌సీయూకే సినిమాలో ఫణి భూపాల్‌గా ప్రధాన పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. న్యూఇయర్ స్పెషల్‌గా ఈ సినిమా టీజర్ విడుదలైంది. అందులో ఫణి భూపాల్‌గా జగపతిబాబు నటించారు. ఇందులో ఫణి భూపాల్ పాత్రకు దాదాపు యాభై సంవత్సరాలు ఉన్నా బుద్ది మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎటువంటి అమ్మాయినైనా ఇట్టే పడేస్తాడు. ఇక అతడి కుమారుడు కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడు. అలాంటిది ఫణి భూపాల్‌కు కూతురు పుడుతుంది. తనే చిట్టీ. దాంతో కొడుకు అందరూ షాక్ అవుతారు. ఇందులో పిల్లల డాక్టర్‌గా అమ్ము అభిరామ్ అలియాస్ ఉమా పాత్రలో కనిపిస్తుంది. వీరి నలుగురి మధ్య నడిచే కథనే ఎంతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్రీకరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పోరులో తలపడేందుకు సిద్దమవుతోంది. మరి ప్రేక్షకులను ఎంతమేరకు ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.