ఎల‌క్ట్రానిక్ సిగ‌రెట్ల‌పై నిషేధం?

ఎల‌క్ట్రానిక్ సిగ‌రెట్ల‌పై నిషేధం?

నేటి త‌రం బానిస‌గా మారుతున్నందున ఎల‌క్ట్రానిక్ సిగ‌రెట్ల‌ను (ఈ సిగ‌రెట్ల‌ను) నిషేధించే అంశాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డీఏ) ప‌రిశీలిస్తోంది. సాధార‌ణ సిగ‌రెట్లు ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని  ఈ సిగ‌రెట్ల‌కు అనుమ‌తి ఇచ్చారు.ఇవి కూడా ఓ అంటువ్యాధిలా మారిన‌ట్లు ఎఫ్‌డీఏ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. పైగా చిన్న పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు కంపెనీలు వివిధ ర‌కాల రుచుల‌తో (ఫ్లేవ‌ర్డ్ ) సిగ‌రెట్ల‌ను త‌యారు చేస్తున్నాయి.  ఎన్నిర‌కాల హెచ్చ‌రిక‌లు జారీ చేసినా... అక్ర‌మంగా నిషేధిత వ‌ర్గాల‌కు కూడా రీటైల్ దుకాణాలు అమ్ముతున్నాయ‌ని ఎఫ్‌డీఏ అదికారి తెలిపారు. ఈ సిగ‌రెట్లు స‌మాజంలో ఓ అంటువ్యాధిలా ప్ర‌బలుతున్న‌ట్లు మాకు క‌చ్చితంగా కనిపిస్తోంద‌ని ఎఫ్‌డీఏ క‌మీష‌న‌ర్ స్కాట్ గొట్లీబ్ అన్నారు. పిల్ల‌ల‌కు ఈ సిగ‌రెట్లు అమ్ముతున్న దుకాణాల‌పై దాడుల‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. క్యాండీలు, బ‌బుల్ గ‌మ్, ఫ్రూట్ ఫ్లేవ‌ర్స్ రూపంలో కూడా ఈ సిగ‌రెట్స్ అమ్ముతున్నారు. 2017లో 20 ల‌క్ష‌ల మిడిల్ స్కూల్, హై స్కూల్ విద్యార్థులు ఈ సిగరెట్ల‌ను వాడిన‌ట్లు గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. ఈ సిగ‌రెట్ల‌పై నిషేధం విధించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు రావ‌డంతో పొగాకు సిగ‌రెట్లు త‌యారు చేసే కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి.