అమెరికాలో పెరిగిన వడ్డీ రేట్లు

అమెరికాలో పెరిగిన వడ్డీ రేట్లు

ఊహించినట్లే అమెరికా కేంద్ర బ్యాంక్‌.. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచింది. తాజా పెంపుతో వడ్డీ రేట్లు 1.75 శాతం నుంచి 2 శాతానికి పెరిగింది. ఆర్థికవృద్ధి రేటు చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతోందని, ద్రవ్యలోల్బణం పెరుగుతోందని ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. రెండో సమావేశం తరవాత ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ మీడియాతో మాట్లాడారు. వడ్డీ రేట్లు పెరిగినా వృద్ధి రేటుకు ఎలాంటి ఢోకా ఉండదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరో రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయని పావెల్‌ అన్నారు. తాజా పెంపుతో అమెరికాలో వడ్డీ రేట్లు 2008 ఆర్థిక సంక్షోభం మునుపటి స్థాయికి చేరాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లతో కార్లు, తనఖా వడ్డీ రేట్లతో పాటు క్రెడిట్‌ కార్డు వడ్డీ రేట్లు పెరగనున్నాయి.