ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖారారు

ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖారారు

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడేళ్లకు ఫీజులను ప్రకటించారు. సీబీఐటీలో అత్యధికంగా రూ.1.34 లక్షలు, వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో రూ.1.30 లక్షలుగా నిర్ణయించారు. మొత్తం 191 కాలేజీలకు ఫీజులు ఖరారు చేశారు. నర్సాపూర్‌ బీవీఆర్‌ఐటీలో రూ.1.20 లక్షలు, సీవీఆర్, ఇబ్రహీంపట్నంలో రూ.1.15 లక్షలు, గోకరాజు గంగరాజు కాలేజీలో 1.22 లక్షలుగా నిర్ణయించారు. రేపటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్స్ ఎంపిక ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫీజులను ఖరారు చేసింది సర్కార్. ఇంజినీరింగ్ కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించింది ప్రభుత్వం. ఇప్పటికే రూ.50 వేలకంటే తక్కువ ఫీజు ఉన్న కాలేజీలు 20 శాతం ఫీజు పెంచుకోవడానికి.. రూ.50 వేలకంటే ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీల్లో 15 శాతం ఫీజులు పెంచే విధంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేసే కాలేజీల ఫీజులు నిర్ణయించారు.