కరోనాను జయించిన మలైకా..!

కరోనాను జయించిన మలైకా..!

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఈనెల 7న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా చికిత్స తరవాత ఆమె కొలుకున్నట్టు వివరించింది. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇన్నిరోజులు నిర్బంధంలో ఉన్న అనుభూతి కలిగిందని...ఇప్పుడు భయటకు వచ్చి సంతోషంగా ఫీల్ అవుతున్నానని వెల్లడించింది. పాజిటివ్ వచ్చాక కొంత అస్వస్థతకు గురయ్యానని అయితే డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ తో కొలుకున్నానని పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపింది. కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఐసోలేషన్ లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంది. కరోనా రావడంతో తన కుమారుడిని, పెంపుడు కుక్కను దూరం పెట్టాల్సివచ్చిందని ఆవేదన చెందింది. తన కుమారుడిని, కుక్కను హగ్ చేసుకోలేకపోతున్నానని పేర్కొంది.