మోడీ ప్రమాణస్వీకారానికి విదేశీ నేతలు

మోడీ ప్రమాణస్వీకారానికి విదేశీ నేతలు

భారత ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపడుతున్న నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి విదేశాల నుంచి నేతలు రానున్నట్లు సమాచారం. మే 30న ప్రధాని ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. ఈమేరకు విదేశీ నేతల ఆహ్వానంపై పార్టీలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌ పొరుగున్న ఉన్న దేశాల అధినేతలతో పాటు, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల అధ్యక్షులను ఆహ్వానించే అవకాశాలున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, అబుదబీ యువరాజు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతాన్యాహూతో ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. వీరిని కూడా ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించాలని యోచిస్తున్నారు.