సౌరవ్ గంగూలీ అభినందన ఎంతో ప్రత్యేకం

సౌరవ్ గంగూలీ అభినందన ఎంతో ప్రత్యేకం

సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు రిషబ్ పంత్  36 బంతుల్లోనే 78 పరుగుల చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పంత్‌ను అందరూ ప్రశంసల్లో ముంచెత్తారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం డగౌట్‌లో ఉన్న ఢిల్లీ సలహాదారు సౌరవ్‌ గంగూలీ సైతం మైదానంలోకి వచ్చి ఆనందంతో రిషబ్ ను  గాల్లోకి లేపాడు. అయితే, ఈ సంఘటన గురించి పృథ్వీ షాతో మాట్లాడుతూ ‘సౌరవ్‌ సర్‌ నన్ను ఎత్తుకొని అభినందించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన’ అని పంత్‌ చెప్పాడు. ఇదో ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నాడు. పంత్‌ను ఎత్తుకున్న ఫొటోను దాదా తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ‘రిషబ్.. యూ డిసర్వ్‌ ఇట్‌’ అంటూ రాసుకొచ్చాడు. ‘మ్యాచ్‌ మలుపు తిప్పిన ఇన్నింగ్స్‌ ఆడావు. దావన్‌ కూడా మరిచిపోలేని ప్రారంభం ఇచ్చాడు’ అని సచిన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. రాజస్థాన్ పై ఆరువికెట్ల తేడాతో విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది.