ఓటు వేయడంలో ఆడవాళ్లే ముందున్నారు !

ఓటు వేయడంలో ఆడవాళ్లే ముందున్నారు !

ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఈసారి పెరిగింది.  2014లో 78.4 శాతం పోలింగ్ నమోదుకాగా ఈసారి 79.63 శాతం నమోదైంది.  అందుకు కారణం మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడమే. రాష్ట్రంలో కోటి 98 లక్షల మంది మహిళా ఓటర్లు ఉండగా వారిలో కోటి 57 లక్షల మంది ఓటు వేశారు.  పురుషులు కోటి 94 లక్షలు ఉండగా వారిలో కోటి 55 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అంటే మహిళలే అధిక శాతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారన్నమాట.  వీరిలో ఎక్కువమంది ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో వారే అత్యధిక అధికారం చేపట్టే అవకాశముంది.