క్రిస్లర్‌, రేనాల్ట్‌ విలీనం?

క్రిస్లర్‌, రేనాల్ట్‌ విలీనం?

ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీలు ఫియట్‌ క్రిస్లర్‌, రేనాల్డ్‌ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విలీనానికి సంబంధించి రెండు కంపెనీల మధ్య కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నా... గత వారం రోజుల నుంచి ఇవి ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విలీనం కుదురకపోతే... కనీసం భాగస్వామ్యం కోసమైనా అంగీకరానికి రావాలని రెండు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. రెండు కంపెనీల వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు వృథా వ్యయం తగ్గించుకోవడానికి ఈ విలీనం ఉపయోగపడుతుందని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం నిస్సాన్‌తో రేనాల్డ్‌తో ఒప్పందాలు ఉన్నాయి. పలు అంశాల్లో రెండు కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.  ఇటీవల నిస్సాన్‌ కంపెనీ సీఈఓను అధికారులు అరెస్ట్‌ చేయడంతో రేనాల్డ్‌ ఇతర ఒప్పందాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. నిస్సాన్‌, రినాల్ట్‌ సంయుక్త సంస్థతో ఫియట్‌ క్రిస్లర్‌ ఒప్పందానికి సిద్ధమౌతుందా అన్న అంశంపై కూడా ఆటో పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి.