కేరళకు సాయి పల్లవి విరాళం

కేరళకు సాయి పల్లవి విరాళం

కేరళను ఆదుకోవడానికి సినీతారలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు.  ఇప్పటికే అనేకమంది తారలు కేరళకు అండగా నిలుస్తూ సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు.  మలయాళంలో ప్రేమమ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సాయి పల్లవి కేరళను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది.  తన వంతు సహాయంగా రూ.35 లక్షల సహాయాన్ని ప్రకటించింది. 

మలయాళంలో సూపర్ హిట్టైన ప్రేమమ్ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు.  ఫిదా సినిమా ద్వారా సాయి పల్లవి మంచి పేరు తెచ్చుకుంది.  ఫిదాలో సాయి పల్లవి నటనకు తెలుగు ప్రేక్షకులు నిజంగా ఫిదా అయ్యారు.  ప్రస్తుతం తెలుగులో పడిపడిలేచే మనసు, మారి 2, సూర్య ఎంజీకే సినిమాల్లో నటిస్తున్నది.