ఫిఫా విజేతకు 260 కోట్లు

ఫిఫా విజేతకు 260 కోట్లు

2018 టోర్నీలో ఒక్క మ్యాచ్‌ ఓడిపోకుండా ఫ్రాన్స్‌ జట్టు అజేయంగా నిలిచింది. ఆదివారం లుజ్నికి స్టేడియంలో జరిగిన తుది పోరులో ఫ్రాన్స్‌ 4–2 గోల్స్‌ తేడాతో క్రొయేషియాపై ఘన విజయం సాధించి రెండో సారి వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా నిలిచింది. ఫ్రాన్స్‌ ఇంతకుముందు 1998లో ప్రపంచకప్‌ సాధించింది. ఫిఫా విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌  జట్టు 3 కోట్ల 80 లక్షల డాలర్ల(రూ. 260 కోట్లు) ప్రైజ్ మనీ అందుకుంది. రన్నరప్‌ క్రొయేషియా జట్టు 2 కోట్ల 80 లక్షల డాలర్లు(రూ. 191 కోట్లు) దక్కించుకుంది. మూడో  స్థానం బెల్జియంకు 2 కోట్ల 40 లక్షల డాలర్లు(రూ. 164 కోట్లు). నాలుగో స్థానం ఇంగ్లండ్‌కు 2 కోట్ల 20 లక్షల డాలర్లు(రూ. 150 కోట్లు). క్వార్టర్స్‌లో ఓడిన జట్లు కోటీ 60  లక్షల డాలర్లు(రూ. 109 కోట్లు) అందుకున్నాయి. ప్రిక్వార్టర్స్‌లో ఓడిన జట్లు కోటీ 20 లక్షల డాలర్ల చొప్పున(రూ. 82 కోట్లు) గెలుచుకున్నాయి. ఇక లీగ్‌ దశలో నిష్క్రమించిన జట్లు 80 లక్షల డాలర్లు చొప్పున(రూ. 54 కోట్లు) అందుకున్నాయి.