సాకర్‌ ఫీవర్‌ ఎంతలా ఉందంటే...

సాకర్‌ ఫీవర్‌ ఎంతలా ఉందంటే...

ప్రపంచం మొత్తాన్ని ఇపుడు సాకర్‌ ఫీవర్‌ పట్టుకుంది. మైదానంలో అభిమాన ఆటగాళ్లు బంతిని గోల్ పోస్ట్ లోకి పంపి గోల్స్‌ సాధిస్తుంటే.. మైదానం వెలుపల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానుల సందడితో సాకర్‌ ఫీవర్‌ మైదానంలోనే కాదు బయట కూడా మొదలైంది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్‌ను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రదర్శిస్తారు. తాజాగా ఓ అభిమాని ఫుట్‌బాల్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్న రూపంలో తెలియజేశాడు. యూకేలోని చెల్టెన్‌ హామ్‌కు చెందిన గస్‌ హల్లీ ఫుట్‌బాల్‌పై ఉన్న అభిమానాన్ని బీర్ల రూపంలో తెలియజేశాడు. ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌-2018లో తలపడుతున్న 32 దేశాల బీర్లను సేకరించి ఫుట్‌బాల్‌పై తనకున్న వీరాబిమానాన్ని చాటుకున్నాడు. ఈ అభిమానానికి గస్‌ హల్లీకి దాదాపు రూ. 45 వేల ఖర్చు అయిందట. 

Photo: FileShot