ఫిఫాలో మరో విషాదం

ఫిఫాలో మరో విషాదం

ఫిఫా వరల్డ్ కప్ వేదికగా మరో విషాదం చోటుచేసుకుంది. ఈజిప్ట్ మాజీ ఫుట్ బాల్ ఆటగాడు, ప్రస్తుతం కామెంటేటర్ అబ్దెల్ రహీమ్ మహ్మమద్ గుండెపోటుతో మృతి  చెందాడు.  గతవారం అర్జెంటీనా దారుణ ఓటమిని జీర్ణించుకోలేని ఓ వీరాభిమాని సూసైడ్‌ చేసుకున్నాడు. తాజాగా ఓ కామెంటేటర్‌ ఈజిప్ట్ టీమ్ ఓటమిని  తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. మ్యాచ్ 1-1తో డ్రాగా ముగుస్తుంది అనుకున్న సమయంలో సౌదీ అరేబియా డిఫెండర్‌ సలేం  అల్‌ దాస్రి అదనపు సమయంలో అద్భుతమైన గోల్‌ చేసి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. దీంతో మహమ్మద్‌ తీవ్ర మనస్తాపం చెందాడు. ఉన్నట్టుండి అపస్మారక  స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి  గ్రూప్‌లో అట్టడుగు స్థానంతో ఈజిప్టు టోర్నీ నుంచి నిష్ర్కమించింది. తమకిష్టమైన టీమ్‌ గెలిస్తే ఆనందంతో ఎగిరి గంతులేసే వీరాభిమానులు ఉన్నారు. ఒకవేళ ఓడితే  ప్రాణాలు తీసుకునే పిచ్చి అభిమానులున్నారు