హ్యారీ కేన్‌ హ్యాట్రిక్‌.. ఇంగ్లండ్‌ విజయం

హ్యారీ కేన్‌ హ్యాట్రిక్‌.. ఇంగ్లండ్‌ విజయం

ఇంగ్లండ్‌ కెప్టెన్ హ్యారీ కేన్‌ హ్యాట్రిక్‌ గోల్స్ సాధించడంతో పనామా జట్టు చిన్నబోయింది. గ్రూప్‌ ‘జి’లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌, పనామా జట్ల మధ్య జరిగిన పోరులో ఇంగ్లండ్‌ 6–1తో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ జట్టు తొలి అర్ధభాగం నుంచే పనామాపై ఒత్తిడి పెంచింది. ఆరంభం నుంచే ఇంగ్లండ్‌ ఎదురుదాడులకు పాల్పడడంతో  పనామా జట్టు కనీస పోటీనివ్వలేకపోయింది. 8వ నిమిషంలో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ కార్నర్‌ నుంచి ట్రిప్పియెర్‌ ఇచ్చిన పాస్‌ను ఇంగ్లాండ్ ఆటగాడు స్టోన్స్‌ అద్భుత రీతిలో హెడర్‌తో గోల్‌ చేశాడు. అనంతరం ఇంగ్లండ్‌ తమ జోరు కొనసాగించి 36వ నిమిషంలో లిన్‌గార్డ్‌ ఒక గోల్‌ సాధించారు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌ మూడు గోల్స్‌ (22వ,  45+1వ, 62వ నిమిషాల్లో) సాధించడంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ దూసుకెళ్లింది. జాన్‌ స్టోన్స్‌ మరో గోల్ చేయడంతో ఇంగ్లాండ్ 6-0 స్కోరుతో ఉంది. మరోవైపు పనామా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను ఫిలిప్‌ బెలోయ్‌ 78వ నిమిషంలో సాధించాడు. తాజా విజయంతో ఇంగ్లండ్‌ వరుసగా రెండు విజయాలతో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇదే గ్రూప్ లో ఉన్న బెల్జియం కూడా ఇప్పటికే నాకౌట్‌కు చేరింది. 

Photo: FileShot