జర్మనీ సంచలన విజయం

జర్మనీ సంచలన విజయం

డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీ ప్రపంచక్‌పలో సంచలన విజయం సాధించి బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో మెక్సికో చేతిలో ఎదురైన అనూహ్య పరాజయం అనంతరం జర్మనీ మ్యాచ్ చివరలో కోలుకుని రేసులో నిలిచింది. చావు రేవో తేల్చుకోవాల్సిన దశలో తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగిన జర్మనీ జట్టు స్వీడన్‌పై 2-1తో గెలిచి నాకౌట్‌  అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ 32వ నిమిషంలో స్వీడన్‌ ఆటగాడు ఒలా టొయివొనెన్‌ గోల్‌ సాధించి స్వీడన్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత 48వ నిమిషంలో జర్మనీ ప్లేయర్ మార్కోస్‌ ర్యూస్‌ చక్కటి గోల్‌తో స్కోర్ ను 1-1తో సమం చేశాడు. నిర్ణీత సమయం దాటి ఇంజ్యూరీ సమయం కూడా ముగింపు దశకు  రావడంతో ఇక గెలుపు ఆశలు వదులుకున్న వేళ అద్భుతం జరిగింది. ఆట ఆగిపోవడమే తరువాయి అనుకుంటున్నసమయంలో 94 నిమిషాల 39వ సెకన్లో టోనీ క్రూస్‌ చేసిన గోల్‌తో జర్మనీ 2-1తో విజేతగా నిలిచింది. అయితే జర్మనీ నాకౌట్‌ చేరాలంటే బుధవారం దక్షిణ కొరియాతో చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

Photo: Fileshot