ఆస్ట్రేలియాపై పెరు ఓదార్పు విజయం

ఆస్ట్రేలియాపై పెరు ఓదార్పు విజయం

ఫిఫా ప్రపంచకప్‌లో పెరూ జట్టు ఓదార్పు విజయంతో టోర్నీ నుండి నిష్క్రమించింది. మంగళవారం జరిగిన గ్రూప్‌-సి మ్యాచ్‌లో పెరూ 2-0తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభమయిన మొదటి అర్ధ భాగం రెండో నిమిషంలోనే ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిలే జెడినాక్‌ను పెరు ఆటగాడు గుర్రెరో కావాలనే అడ్డుకోవడంతో ఫ్రీకిక్‌ లభించింది. కానీ జెడినాక్‌ దానిని గోల్‌ చేయలేకపోయాడు. అనంతరం కొంత సమయం ఇరు జట్లు గోల్ చేయడానికి ప్రయత్నించినా సఫలం కాలేదు. ఆ తర్వాత పెరు జట్టు  దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో పెరూ ఆటగాడు ఆండ్రే కరిల్లో 18వ నిమిషంలో గోల్ చేసి ఆధిక్యం తెచ్చాడు. దీంతో తొలి భాగమును పెరు 1-0తో ముగించింది. రెండవ అర్ధ భాగం 50వ నిమిషంలో పెరు కెప్టెన్‌ పాలో గుర్రెరో గోల్‌ చేశాడు. దీంతో పెరు ఆధిక్యం 2-0కు చేరింది. ఆట చివరి వరకు కూడా ఆసీస్ ఒక్క గోల్ కూడా చేయలేక ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియా ఒక్క విజయమూ లేకుండానే టోర్నీ నుండి నిష్క్రమించింది. గ్రూప్‌ ‘సి’ నుండి ఫ్రాన్స్‌, డెన్మార్క్‌లు నాకౌట్‌కు చేరాయి. 
Photo: FileShot